రాజావారు రాణిగారుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.ఈసినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.అయితే దీని తరువాత మూడు సంవత్సరాల గ్యాప్ లో ఏకంగా 7 సినిమాలతో వచ్చాడు.ఇందులో ఎస్ ఆర్ కల్యాణమండపం,వినరో భాగ్యము విష్ణు కథ మాత్రమే డీసెంట్ హిట్స్ అనిపించుకున్నాయి.ఇక తన చివరి సినిమా రూల్స్ రంజన్ కూడా నిరాశపరచడంతో లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు.అయితే వరసగా సినిమాలు ప్లాప్ కావడంతో ఈసారి కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెగ్యులర్ స్టోరీస్ తో లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు మానేసి కొత్త పంథాలో వెళ్లనున్నాడు.తన నెక్స్ట్ సినిమాను పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో చేయనున్నాడు. ఇందుకోసం 20కోట్లకుపైగా బడ్జెట్ పెట్టనున్నారు.తన లుక్ తోపాటు అన్ని మారనున్నాయి.టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారు.ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈసినిమాకు తనే సమర్పకుడిగా కూడా వ్యవహరించనున్నాడని సమాచారం.జూలై 15న కిరణ్ తన బర్త్ డే ను జరుపుకోనున్నాడు.ఆరోజు ఈసినిమాకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి.మరి ఈ సారైనా తను అనుకున్న విజయం దక్కుతుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























