టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యాక్ట్రెస్ లో నివేద థామస్ కూడా ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన నటనతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక తన నుండి చివరిగా వచ్చిన సినిమా శాకిని డాకిని. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. నంద కిషోర్ దర్శకత్వంలో నివేదా థామస్ హీరోయిన్ గా 35 అనే సినిమాతో వస్తుంది. చిన్న కథ కాదు అనేది ఈసినిమా క్యాప్షన్. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు ఉదయం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ లుక్ అయితే ఆకట్టుకుంది. ఇప్పుడు మరో అప్ డేట్ తో వచ్చారు. తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ కూడా ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాలో ఇంకా ప్రియ దర్శని, విశ్వదేవ్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. టాలెంటెడ్ హీరో రానా దగ్గబాటి ఈసినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























