యూఎస్‌లో విధ్వంసం సృష్టిస్తోన్న కల్కి

Kalki 2898 AD 3 Days Collections of USA

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కల్కి మేనియా నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభాస్ నటనకు తోడు కీలక పాత్రల్లో కనిపించిన బిగ్ బి, కమల్ హాసన్, దీపికా పదుకొణె స్క్రీన్ ప్రజెన్స్ చిత్రానికి ప్లస్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సినిమాలో విజువల్స్ అయితే హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉన్నాయని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. దీంతో ఈ విజువల్ వండర్‌ విడుదలైన అన్నిచోట్లా మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన కల్కి తొలిరోజు వసూళ్ల సునామీనే సృష్టించింది. ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లో సైతం డాలర్ల వర్షం కురిపించింది.

కాగా ఈ ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామా ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లో సైతం డాలర్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. 3 రోజుల్లో 11.1 మిలియన్ డాలర్లకు పైగా సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ క్రమంలో ఆదివారం ఒక్కరోజే 1,701,364 డాలర్స్ వసూలు చేయడం గమనార్హం. దీంతో ఇప్పటికే ఇక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో కల్కి 3వ స్థానంలో నిలీచింది.

వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్‌ అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే కథానాయికగా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్‌ బచ్చన్‌ మరియు కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.