ఓదెల2- హైద్రాబాద్ లో కీలక షెడ్యూల్

odela 2 movie crucial action schedule started in hyderabad

అశోక్ తేజ ద‌ర్శ‌కత్వంలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ఓదెల రైల్వేస్టేషన్‌ అనే థ్రిల్లర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందించాడు. 2022 లో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈసినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టారు. రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా షూటింగ్ గురించి ఒక అప్ డేట్ బయటకు వచ్చింది. ఈసినిమా కీలక షెడ్యూల్ హైద్రాబాద్ లో మొదలైంది. ఈ షెడ్యూల్ లో కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ ను అందిస్తాయని అంటున్నారు.

కాగా ఈసినిమాలో ఇంకా వశిష్ఠ ఎన్‌ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌, మధు క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ఈసినిమాకు అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.