కల్కిపై కేజీఎఫ్ స్టార్ యష్ రివ్యూ

KGF Star Yash Reviews on Kalki 2898 AD

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధానపాత్రలో నటించగా, క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సీనియర్ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ, డైరెక్టర్ శైలేష్ కొలను, హీరో నాని, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సహా పలువురు కల్కిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో తాజాగా ‘కేజీఎఫ్’ స్టార్ యష్ కల్కి మూవీపై రివ్యూ ఇచ్చారు.

ఈ మేరకు యష్ తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో.. “దృశ్యపరంగా అద్భుతమైన దృశ్యాన్ని సృష్టించినందుకు కల్కి 2898 AD బృందానికి అభినందనలు! ఈ చిత్రం మరింత సృజనాత్మక కథనానికి మార్గం సుగమం చేస్తుంది. నాగ్ అశ్విన్ మరియు వైజయంతీ ఫిలిమ్స్, మీ విజన్ మరియు ధైర్యం చాలా మందిని పెద్ద ఎత్తులు వేయడానికి ప్రేరేపిస్తాయి” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు.. “డార్లింగ్ ప్రభాస్, సీనియర్ బచ్చన్ సర్, కమల్ హాసన్ సార్ మరియు దీపికా పదుకొణే.. అలాగే మరికొన్ని సర్‌ప్రైజ్ క్యామియో రోల్స్, ఇన్ని కలిసి ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చాయి. ఇలా ఈ చిత్రాన్ని ఒకచోట చేర్చడంలో భాగం అయిన ప్రతి ఒక్కరికీ అభినందనలు – ఇది నిజంగా తెరపై వెలుగులు నింపుతోంది!” అని తెలిపారు.

వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్‌ అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్‌ బచ్చన్‌ మరియు కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.