టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కావ్య థాపర్ ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతోపాటు ఇతర భాషల్లో రిలీజైన ఈ టీజర్ 100 మిలియన్లకు పైగా డిజిటల్ ఇంప్రెషన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో.. ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి త్వరలోనే మ్యూజిక్ జాతర మొదలుకానుంది. మాస్ పటాకా ఫస్ట్ సింగిల్ స్టెప్పామార్ జూలై 1న విడుదలవుతోంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
కాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను రేపు ఉదయం రిలీజ్ చేయనున్నారు. ఇక పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్ వంటి పలు చిత్రాలలో పూరీ జగన్నాధ్‌కు సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ ‘డబుల్ ఇస్మార్ట్’కు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మరోసారి వీరి కలయికలో చార్ట్‌బస్టర్ ఆల్బమ్ పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.
కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ క్రేజీ ఎంటర్టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తుండటం గమనార్హం. అలాగే స్టంట్ డైరెక్టర్ కేచ నేతృత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారు. కాగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























