నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా కల్కి 2898ఏడీ. ఈసినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారో సినీ ప్రేక్షకులు. ఇక వారి ఎదురుచూపులకు నిన్నటితో బ్రేక్ పడింది. ఎన్నో అంచనాల మధ్య నిన్న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ను అందించింది. యునానిమస్ హిట్ ను అందించారు ప్రేక్షకులు. కలియుగాంతానికి, మహాభారతానికి లింక్ పెట్టి ఈ కథను తీసిన విధానానికి ఫిదా అవ్వడమే కాకుండా నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని మాత్రమే చూడాలి. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 191.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. తెలుగులో రూ.70 కోట్లు, హిందీలో రూ.25 కోట్లు, మిగిలిన భాషల్లో రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. మరోవైపు ఓవర్సీస్ లో ఈసినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం.
కాగా ప్రభాస్ హీరోగా నటించిన ఈసినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, అన్నా బెన్ తదితరులు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























