సినిమాలు అనేవి రికార్డుల కోసం కాదని, ప్రేక్షకుల కోసం తీసేవి అని పేర్కొన్నారు టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ స్వప్న దత్. తాజాగా ఆమె తన సోదరి ప్రియాంక దత్ మరియు తండ్రి అశ్వనీదత్‌తో కలిసి ‘కల్కి 2898 AD’ని నిర్మించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మైథాలజీ-ఇన్స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీలింగ్వెల్ చిత్రం బెనిఫిట్ షోల తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టిస్తోంది. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా ఉందని, ఇలాంటి సినిమా ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రాలేదని మూవీ లవర్స్ చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన స్వప్న దత్ ఈ సినిమా రికార్డులపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న కల్కి సినిమా రిలీజ్ అయినప్పటినుంచీ చాలామంది నుంచి కాల్స్ వస్తున్నాయని, అందరూ ఒకదాని గురించే అడుగుతున్నారని అన్నారు. కల్కి సినిమా ఏదయినా రికార్డ్ క్రియేట్ చేసిందా? లేదంటే.. ఏదయినా రికార్డ్ బ్రేక్ చేసిందా? అని అడుగుతున్నారని తెలిపారు.
అయితే ఇది చాలా హాస్యాస్పదం అని, ఎందుకంటే ఆ రికార్డులను సృష్టించిన చిత్రాలను ఆయా మేకర్స్ ఎప్పుడూ రికార్డుల కోసం చేయలేదని, అన్నారు. ఇక నిర్మాతలుగా మేము సినిమాలను కేవలం ప్రేక్షకుల కోసమే తీస్తున్నామని, అలాగే సినిమాపై ప్రేమతో నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
కాగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























