తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ చిత్రం ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్‌లో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఉలగనాయగన్ కమల్ హాసన్, దిశా పటాని, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలకు ముందు రిలీజ్ చేసిన కల్కి ప్రచారచిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై హైప్ ఓ రేంజ్‍లో వచ్చింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ. 100 కోట్లకు పైగా సాధించింది. దీనికితోడు నేటి ఉదయం ప్రదర్శించిన బెనిఫిట్ షోలతో అన్ని చోట్లా మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో కల్కి సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
మరోవైపు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ థియేటర్లకు వెళ్లి మరీ ఈ మూవీని వీక్షిస్తున్నారు. ఇక కల్కి చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. కల్కి 2898 AD టీమ్‌కి అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ ఒక పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా సినిమాకి పనిచేసిన నటీనటులు మరియు ఇతర చిత్ర బృందాన్ని ఆయన ప్రశంసించారు.
“నాగి, ప్రభాస్ అన్నా, వైజయంతి ఫిల్మ్స్.. మీ అందరికీ లభించిన విజయం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీరు ఈ విజయానికి పూర్తి అర్హులు. మీ అందరికి దేవుడి ఆశీస్సులు ఉంటాయి. అమితాబ్ బచ్చన్ సార్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ సార్ మీరు లేకపోతే కల్కి ఇలా ఉండేది కాదు. మీ విజయాన్ని నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మనమందరం పోయిన తర్వాత కూడా కల్కి చాలా కాలం గుర్తుండిపోతుంది” అని అందులో విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























