చాలా గ్యాప్ తరువాత అల్లు శిరీష్ నుండి వస్తున్న సినిమా బడ్డీ. శాన్ ఆంటోని దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ఎంత సైలెంట్ గా మొదలైందో అంతే సైలెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే పలు పాటలను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇప్పటికే ఇచ్చారు. ఈనేపథ్యంలోనే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సాయికుమార్ పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలవుతుంది ఈ ట్రైలర్. అన్యాయాన్ని ఎదిరించే టెడ్డిని ఎప్పుడైన చూశారా అంటూ టెడ్డిని చూపిస్తారు. హీరో శిరీష్ ఫైట్ చేస్తూ కనిపిస్తాడు.. ఈ సినిమాలో శిరీష్ పైలెట్ పాత్రలో నటించనున్నట్టు అర్థమవుతుంది. ఇక ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ బాగానే ఉన్నాయి.. అవి ఆకట్టుకుంటున్నాయి కూడా. మొత్తానికి ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది.. సినిమా ఎలా ఉంటుందో చూడాలి..
కాగా ప్రిషా సింగ్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. తమిళ నటుడు అజ్మల్, అలీ ముఖేష్ రిషీ కూడా ఒక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. ఆంటోని రూబెన్ ఎడిటర్ గా, క్రిష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి ఈసినిమాతో అయినా అల్లు శిరీష్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























