మెగాస్టార్, వినాయక్ గారితో మెమరబుల్ డే

mallidi vasishta interesting post about megastar and director vinayak

బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కేవలం టైటిల్ గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ‘విశ్వంభర’తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి విశ్వంభర టీమ్ అన్నీ క్రాఫ్ట్స్ లో చాలా కేర్ తీసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌ లో వేసిన మ్యాసీవ్ సెట్ లో షూట్ జరుగుతోంది. ఈనేపథ్యంలో నేడు విశ్వంభర సెట్ లోకి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ రావడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవిగారితో ఆయనకున్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకుంటూ కాసేపు మాట్లాడుకున్నారు. ఇక వశిష్ట కూడా తన ట్విట్టర్ లో మెగాస్టార్ చిరంజీవి, వి వి వినాయక్ కలసివున్న ఫోటోని షేర్ చేస్తూ.. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి, మై డియరెస్ట్ గురుతో స్పెషల్ అండ్ మెమరబుల్ డే.. నా లైఫ్ లో వీరిద్దరిని కలిగి ఉండటం ఒక బ్లెస్సింగ్ లాంటిది అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

కాగా ఈసినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఈసినిమాను వచ్చేే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. 2025 సంక్రాంతికి జనవరి 10న ఈసినిమా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.