బన్నీ తరువాత అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. గౌరవం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. ఇక ఆ తరువాత నుండి పలు సినిమాలు చేస్తూ కెరీర్ ను కొననసాగిస్తున్నాడు. తన నుండి వచ్చిన చివరి సినిమా ఊర్వశివో..రాక్షసివో. ఆసినిమా తరువాత మరే సినిమాను ఇంతవరకూ రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా బడ్డీ. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ప్రమోషన్స్ ను ఈమధ్యనే మొదలుపెట్టారు కానీ అప్ డేట్స్ మాత్రం పెద్దగా ఇవ్వడంలేదు మేకర్స్. ఆపిల్ల కనులే అంటూ వచ్చే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే ఇప్పుడు ఓ సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చారు. రేపు అంటే జూన్ 25వ తేదీన బడ్డీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైద్రాబాద్ లోని ఏఏఏ సినిమాస్ లో 3 గంటల నుండి నిర్వహించనున్నారు.
కాగా ప్రిషా సింగ్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. తమిళ నటుడు అజ్మల్, అలీ ముఖేష్ రిషీ కూడా ఒక కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. ఆంటోని రూబెన్ ఎడిటర్ గా, క్రిష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి ఈసినిమాతో అయినా అల్లు శిరీష్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























