టాలీవుడ్ అగ్ర నటుడు, స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఒక అభిమానికి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌లో తన బాడీగార్డ్ చేసిన పనికి విచారణం వ్యక్తం చేసిన ఆయన మరోసారి అలా జరుగకుండా చూసుకుంటా అని హామీ ఇచ్చారు. కాగా నాగార్జున ప్రస్తుతం ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలి వరకూ చెన్నైలో షూటింగ్ జరుపుకున్న కుబేర, తాజాగా ముంబైలో కీలక షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనేందుకై నాగార్జునతోపాటు హీరో ధనుష్ కూడా నగరానికి విచ్చేశారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు హీరోలు నడుచుకుని వస్తుండగా.. అక్కడే ఒక షాపులో పనిచేస్తున్న ఓ అభిమాని నాగ్‌ను కలిసేందుకు ముందుకు వచ్చాడు. అయితే నాగ్ బౌన్సర్ అతడిని అడ్డుకున్నాడు.
అంతటితో ఆగకుండా గట్టిగా పక్కకు తోసేశాడు. దీంతో కిందపడబోయిన ఆ అభిమాని ఎలాగోలా తమాయించుకుని నిలబడ్డాడు. ఈ హఠాత్పరిణామంతో చుట్టుపక్కలవారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కొంతమందికి అసలు అక్కడ ఏం జరిగిందో కూడా అర్ధం కాలేదు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో హీరో నాగార్జున ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సదరు అభిమానికి క్షమాపణలు చెప్పారు.
ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ ఒక పోస్టు పెట్టిన ఆయన అందులో.. “ఈ ఘటన నా దృష్టికి వచ్చింది. ఇది జరిగి ఉండాల్సింది కాదు. ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటివి మరోసారి ఇలా జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటా” అని పేర్కొన్నారు. కాగా ఇందులో తన ప్రమేయం లేకపోయినప్పటికీ జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ నాగ్ స్పందించిన తీరుపట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























