పవన్ ఇన్ట్సా పోస్ట్- బాధ్యత పెరిగింది

pawan kalyan first insta post after taking charges

సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్.. ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఉంటాయి సినిమా కలెక్షన్స్ కూడా.. ఫ్లాప్ సినిమాకు కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకునే క్రేజ్ ఆయన సొంతం. ఇక సినిమాల్లో ఎలాగైతే తన మార్కును చూపించాడో ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన మార్కును వేసుకోగలిగాడు. ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మే 13వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే కదా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయగా.. కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఈ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన తీసుకున్న 21 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని మరొక రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా కూటమి విజయానికి ఒక పిల్లర్ గా నిలిచాడు.

ఇదిలా ఉండగా ఇప్పటికే పవన్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టారు. దానితో పాటు మంత్రిగా నాలుగు శాఖల బాధ్యతలను కూడా తీసుకున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు కేటాయించారు. ఇక బాధ్యతలను తీసుకున్న వెంటనే తన ఇన్ట్సా లో ఒక పోస్ట్ ను షేర్ చేశారు పవన్. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్థి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా ఉంది. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్రానికి అంకితభావంతో, చిత్తశుద్ధితో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను అంటూ పోస్ట్ లో తెలిపారు. పవన్ ఇన్ట్సాలో పోస్ట్ లు పెట్టడం చాలా అరుదుగా చూస్తుంటాం. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టడంతో వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Pawan Kalyan (@pawankalyan)

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.