ప్రస్తుతం ఎక్కడా చూసినా కల్కి సినిమా హంగామానే కనిపిస్తుంది. ఈసినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ అన్నీ ఆకట్టుకోగా.. ఈమధ్య రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. అంతేకాదు ఈసినిమాలో బుజ్జి పేరుతో ఉన్న కారును కూడా మంచి బజ్ ను క్రియేట్ చేసింది. రీసెంట్గా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇలా వచ్చిన ప్రతి అప్ డేట్ రికార్డులు క్రియేట్ చేస్తూ మంచి హైప్ నే తెచ్చిపెట్టాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పుడు ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా రన్ టైమ్ ను లాక్ చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. ఇక రన్ టైమ్ విషయానికి వస్తే 3 గంటల 56 నిమిషాల నిడివి ఉన్నట్టు తెలుస్తుంది.
కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఇది. ఈసినిమా మహాభారతంతో మొదలై క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇదని చిత్రయూనిట్ ఇప్పటికే తెలియచేసింది. కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























