ఈఏడాది ప్రారంభంలోనే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. అదే జోష్ తో గం గం గణేశా సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కగా.. ఎన్నో అంచనాల మధ్య మే 31వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈసినిమా మంచి విజయాన్ని అందించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఎలాంటి హడావుడి లేకుండా ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
కాగా ఈసినిమాలో ఇంకా ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈసినిమాకు ఆదిత్య జవ్వాడి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఇక ఈసినిమా కథ విషయానికి వస్తే గణేష్ కు (ఆనంద్ దేవరకొండ) దొంగతనాలు చేస్తూ ఉంటాడు. మరోవైపు శృతి (నయన్ సారిక) తో ప్రేమలో పడతాడు. అయితే శృతి మాత్రం తనకు బెటర్ ఆప్షన్ దొరకగానే గణేష్ కు హ్యాండిచ్చి వదిలి వెళ్లిపోతుంది. అలా సాగిపోతున్న క్రమంలో గణేష్ అనుకోకుండా ఒక డైమండ్ ను దొంగతనం చేస్తాడు. ఆ డైమండ్ కోసం ఒక గ్యాంగ్ గణేష్ ను వెంటాడుతారు. మరి ఆ డైమండ్ కోసం గణేశ్ ఏం చేశాడు ? అసలు ఆ డైమండ్ ముంబై నుంచి తెస్తున్న గణేశ్ విగ్రహంలోకి ఎలా వెళ్ళింది అనేది ఈసినిమా కథ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























