ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేయగా.. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా నుండి భైరవ యాంథమ్ పేరుతో వచ్చే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. దిల్జిత్ సింగ్ ఈపాటను పాడగా ప్రోమోలో తనతో పాటు ప్రభాస్ కూడా ఉన్నాడు. ప్రోమో అయితో ఆకట్టుకుంటుంది. ఫుల్ వీడియో సాంగ్ ను రేపు అంటే జూన్ 16వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























