టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘దేవర’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. కాగా ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే నేడు చిత్ర దర్శకుడు కొరటాల శివ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేవర టీమ్ ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ ఇలా తెలిపింది.. “జీనియస్ డైరెక్టర్ కొరటాల శివకు జన్మదిన శుభాకాంక్షలు. ఇండియన్ సినిమా చరిత్రలో ‘దేవర’ను భారీ తుఫానుగా మార్చే అతని అసమానమైన విజన్ కోసం సిద్ధంగా ఉండండి” అని పేర్కొంది. ఈ సందర్భంగా కొరటాలపై రూపొందించిన ఒక స్పెషల్ వీడియోను షేర్ చేసింది.
ఇక హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. ‘దేవర’ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా.. సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. కాగా విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























