టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోలలో శ్రీవిష్ణు ఒకడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లే ఆయన కథల పరంగా కూడా విభిన్న చిత్రాలు చేయడంలో ముందుంటాడు. ‘సామజవరగమన’తో గతేడాది సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. ఇటీవలే ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి జోష్ మీదున్న శ్రీ విష్ణు ఇదే ఊపులో మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీవిష్ణు ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘స్వాగ్’. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్ కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే సునీల్, రవిబాబు, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ అన్నీ మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ‘స్వాగ్’ నుండి క్రేజీ అప్డేట్ అందించింది చిత్రబృందం. స్వాగ్ టీజర్ రిలీజ్ త్వరలోనే కానున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా సినిమాలో హీరో శ్రీవిష్ణు పాత్రను ఇంట్రడ్యూస్ చేసింది. ఆయన పాత్ర పేరు ‘భవభూతి’గా తెలిపిన చిత్ర యూనిట్ ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఇందులో శ్రీవిష్ణు గెటప్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, నటన కానీ ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ఉంది. సీరియస్ లుక్‌లో కనిపిస్తూ గొంతులో ఒక విధమైన వేరియేషన్ పలికిస్తూ హాస్యం పండించాడు. ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇంతకుముందు 2021లో విడుదలైన ‘రాజ రాజ చోర’ వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా. ఈ మూవీ కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పైనే తెరకెక్కడం విశేషం. ఇక స్వాగ్ చిత్రాన్ని జూలై ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























