వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. అంటే సుందరానికి సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇప్పటికే చిత్రయూనిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. జూన్ 15వ తేదీన ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అయితే తాజాగా ఈపాటకు సంబంధించిన మరో అప్ డేట్ ను ఇచ్చారు. గరం గరం అంటూ ఈపాట రాబోతున్నట్టు తెలుపుతూ నాని మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరి ఈపాట కూడా గరం గరంలా అదే రేంజ్ లో ఉంటుందేమో చూడాలి.
Surya has locked a #GaramGaram Song for us this Saturday 😉
— Sri Venkateswara Creations (@SVC_official) June 11, 2024
Keep your woofers ready for #SSFirstSingle on June 15th 🔥#SaripodhaaSanivaaram#SuryasSaturday
Natural 🌟 @NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JxBe @muraligdop @karthikaSriniva @SVR4446… pic.twitter.com/Y3mRy5ryM9
కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. పాన్ ఇండియా సినిమాగా ఆగష్ట్ 29 వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































