గుమ్మ‌డికాయ కొట్టేసిన ‘దేవకీ నందన వాసుదేవ’

Ashok Galla's Devaki Nandana Vasudeva Movie Shoot Wrapped

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాజీ మిస్‌ ఇండియా మానస వారణాసి హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా ఈ చిత్రానికి ‘హ‌నుమాన్’ ఫేమ్ ప్ర‌శాంత్ వర్మ కథను అందిస్తుండ‌టం విశేషం. ఇక ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో దేవకీ నందన వాసుదేవ నుంచి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ మేరకు మేక‌ర్స్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మూవీ టీమ్ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. కాగా త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీని అనౌన్స్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ తెలిపింది.

దేవకీ నందన వాసుదేవ సినిమాను నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా‌.. తమ్మిరాజు ఎడిటర్‌గా‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.