రామోజీరావు జీవిత ప్రస్థానం

interesting facts about Legendary Media Entrepreneur ramoji rao

ప్రతిరోజూ ఎంతోమంది జన్మిస్తుంటారు.. మరణిస్తుంటారు. అయితే మరణించినా కానీ చరిత్రలో తమ పేరు గుర్తుండిపోయేలా ఉండేవారు మాత్రం అతికొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో మీడియా మొఘల్ రామోజీరావు కూడా ఉంటారు. రామోజీ రావు అంటే మనకు గుర్తొచ్చేది ఈనాడు. కానీ ఆయన జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇంతటి సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. అలాంటి మహా మనిషి నేడు ఉదయం ఆయన మృతి చెందటం ఎంతోమందిని శోకసంద్రంలో నెట్టేసింది. ఈనేపథ్యంలో 88 ఏళ్ల రామోజీరావు ప్రస్థానం ఏంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* 1936 నవంబర్ 16న కృష్ణాజిల్లాలోని పెదపారుపూడిలో జన్నించారు రామోజీరావు. చిన్నప్పటినుండీ కాస్త విభిన్నంగా ఆలోచించే రామోజీరావు ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగంలో విజయాన్నే అందుకున్నారు. విద్యాభాసం తరువాత రామోజీ రావు ఢిల్లీలో తన మొదటి ఉద్యోగం చేశారు. అనంత్ అనే మలయాళీ స్థాపించిన ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్‌గా చేరారు.

* 1961 ఆగస్టు 19న తాతినేని రమాదేవిని ఆయన వివాహం చేసుకున్నారు.

* 1962 ఆయన హైదరాబాద్‌కు తిరిగివచ్చి అదే ఏడాది అక్టోబర్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్‌ను స్థాపించారు.

* 1970 వ సంవత్సరంలో రమాదేవి ఎండీగా ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. దీనికి రమాదేవి నేతృత్వం వహించారు.

* 1974లో విశాఖపట్టణంలో ఈనాడు పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది.

* సినీ లవర్స్ కోసం 1976 అక్టోబర్‌ 3న సితార అనే సినీ పత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక కూడా ఎంత పాపులర్ అయిందే తెలిసిందే.

* ఇప్పటికీ ప్రతి ఇంటిలో ఉండే ప్రియా పుడ్స్ ను స్థాపించింది కూడా ఆయనే. 1980 లో దానిని ప్రారంభించారు.

* 1983లో ఉషాకిరణ్‌మూవీస్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ని స్థాపించారు. దీని ఆధ్వర్యంలో అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు. ఈ బ్యానర్‌లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ సహా 80కి పైగా విభిన్న భాషల్లో సినిమాలు నిర్మించారు.

* ఆ తరువాత టెలివిజన్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 1995లో ఈటీవీని ప్రారంభించారు. ఆతరువాత ఎన్నో ఛానల్స్ ను స్థాపించారు.

* ఇక రామోజీ రావు అంటే గుర్తొచ్చే వాటిలో రామోజీ ఫిలిం సిటీ కూడా ముందుంటుంది. 1996 హైదరాబాద్ శివార్లలో రామోజీ ఫిలిం సిటీ ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే పెద్ద స్టూడియో గా గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి సైతం ఎక్కింది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఎన్నో భాషల చిత్రాలు షూటింగ్ ను జరుపుకుంటాయి. అంతేకాకుండా హైద్రాబాద్ లోని టూరింగ్ ప్లేసుల్లో రామోజీ ఫిలిం సిటీ కూడా ఉంటుంది. రోజుకి ఎంతోమంది ఆ అద్భుతాన్ని చూడటానికి వస్తుంటారు.

* జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన రామోజీరావును ఎన్నో పురస్కారాలు కూడా వరించాయి. నాలుగు సౌత్ ఇండియా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఐదు నంది అవార్డులు, నేషనల్ ఫిల్మ్ అవార్డు సైతం ఆయన్ని వరించాయి. ఇంకా 2016లో, జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషణ్, పద్మ విభూషణ్‌ అందుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.