జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా హరోం హర. పలు వాయిదాల అనంతరం ఈసినిమా ఫైనల్ గా జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేయగా అన్నీ ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పలు అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మరింత బజ్ ను క్రియేట్ చేయడానికి చూస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు. గన్స్ అండ్ వార్ మేకింగ్ వీడియో అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది. వీడియోలో ఈసినిమా కోసం తయారు చేసిన ప్రత్యేక గన్ లను ఎలా తయారు చేశారు.. దానికి చేసిన రీసెర్చ్ గురించి పలు విషయాలు చూపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా ఈసినిమాలో వేసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సెట్ గురించి డైరెక్టర్ జ్ఞానసాగర్ మాట్లాడుతూ.. ఈసినిమా కోసం మేము సుబ్రహ్మణ్య స్వామి సెట్ ను వేశాము.. అయితే ఈ సెట్ ను చూసి అక్కడ ఉన్న భక్కులు వచ్చి పూజల్ చేశారు.. ఇది మంచి పాజిటివ్ వైబ్ ను ఇచ్చింది.. అది చూసి మాకు చాలా సంతోషం కలిగింది.. దాన్నిబట్టి మేము వేసిన సెట్ ఎంత రియలిస్ట్ గా వచ్చిందో అర్థమైంది అంటూ తెలిపాడు.
🎬✨ Behind the scenes, magic is made! Dive into the creative journey of our #HaromHara movie with this exclusive making-of guns and war scenes. Witness the passion and hard work that brings stories to life!!! https://t.co/CY8wnBoRtR#HaromHaraOnJune14th in theaters worldwide… pic.twitter.com/Y51BLYGfRz
— Sudheer Babu (@isudheerbabu) June 7, 2024
కాగా కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్ తో ఈసినిమా రానున్నట్టు అర్థమవుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























