తలైవా కూలీ ఫస్ట్ షెడ్యూల్ అప్ డేట్

thalaiva coolie movie first schedule update

ఈ ఏడాది ఇప్పటికే లాల్ సలామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రజనీకాంత్. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు పలు సినిమాలు రజనీ లిస్ట్ లో ఉన్నాయి. అందులో కూలీ సినిమా ఒకటి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కనుంది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కూలీ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఈనెలలోనే ప్రారంభం కానుందని.. అంతేకాదు ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ చెన్నై, హైదరాబాద్‌లో చేయనున్నట్టు తెలిపారు. ఈ షెడ్యూల్ లో రజనీకాంత్, శృతిహాసన్‌, సత్యరాజ్‌పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. కాగా ఈసినిమాను స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో క‌ళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందించబోతున్నాడు.

దీనితో పాటు రజనీకాంత్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెట్టైయాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే రజనీ తన పోర్షన్ ను కంప్లీట్ చేసుకున్నాడు కూడా. కాగా మంజు వారియర్, రితికా సింగ్ కూడా ఈసినిమాలో నటిస్తున్నారు. అమితాబ్ ఇంకా రానా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.