టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్‌సే స్టూడియోస్ ప్రొడక్షన్‌లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ‘మనమే’ నేడు (శుక్రవారం,జూన్ 7) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయింది. ఈ క్రమంలో మేకర్స్ అంతకుముందు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ శర్వానంద్‌కు ‘ఛార్మింగ్ స్టార్’ టైటిల్ ఇచ్చారు. ఈ మేరకు రూపొందించిన స్పెషల్ వీడియోను ఈవెంట్‍లో ప్రజెంట్ చేశారు. గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేష్, కిషోర్ తిరుమల అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. “మనమే సినిమా నాకు పెద్ద డ్రీం. ఈ డ్రీం ని అచీవ్ చేయడానికి సపోర్ట్ చేసి నా రైటింగ్ టీమ్, లిరిక్ రైటర్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ టీం అందరికీ థాంక్స్. వివేక్ గారు చాలా సపోర్టివ్. కృతి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా డెబ్యు చేశారు. కృతి ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి లక్కీ ఛార్మ్. వండర్ ఫుల్ పర్శన్. విశ్వప్రసాద్ గారు డేరింగ్ ప్రొడ్యూసర్. చాలా ప్యూర్ గా వుంటారు. మనమే ని ఇంత గ్రాండ్ స్కేల్ లో తీసిన ఆయనకి థాంక్స్”
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇందులో ఓ రోల్ చేయడానికి యాక్సప్ట్ చేసిన శివకి థాంక్స్. వెన్నెల కిశోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, అయేషా, శీరత్ అందరికీ థాంక్స్. కృతి శెట్టి ఇందులో చక్కని పెర్ఫార్మెన్స్ వున్న రోల్ లో కనిపిస్తారు. తను చాలా సిన్సియర్. మనమే డ్రీం ని మొదటి నమ్మింది నా డార్లింగ్ శర్వా. నా డ్రీంని నా కంటే బలంగా నమ్మారు. ఈ జర్నీ అంతా చాలా సపోర్ట్ చేశారు. తను ఫినామినల్ యాక్టర్. శర్వా తన ఎనర్జీతో సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు” అని అన్నారు.
“సినిమాని ఇప్పటికే యాభై అరవైసార్లు చూశాను. చూసిన ప్రతిసారి విజల్ వేయాలనిపిస్తుంది. శర్వా క్యారెక్టర్ తో లవ్ లో పడిపోయాను. మై లిటిల్ సన్ విక్రమ్. మై ప్రౌడ్ అఫ్ మై బాయ్. మనల్ని మనం నమ్మి నిలబడితే ఏ రేంజ్ లో ఆన్సర్ ఉంటుందా అనేది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. అదే ఇన్ స్ప్రేషన్ తో టీంలో అందరం ‘మనమే’ని నమ్మి చేశాం. ఈ పండగ వాతావరణంని కంటిన్యూ చేసే సినిమా మనమే అవుతుంది. మీ పేరెంట్స్ ని తీసుకురండి. ఒక గొప్ప ఎక్స్ పీరియన్స్, ఎనర్జీని ఫీల్ అవుతారు” అని డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























