టాప్ 100 లో పుష్ప 2 సాంగ్స్ హవా

Pushpa 2 Songs Create New Records In Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pushpa,Pushpa 2 The Rule,Pushpa 2 The Rule Movie,Pushpa 2 The Rule Telugu Movie,Pushpa 2 The Rule Movie Updates,Pushpa 2 The Rule Movie News,Pushpa 2 The Rule Songs,Pushpa 2 The Rule Movie Songs,Pushpa 2 The Rule Telugu Movie Songs,Pushpa 2 The Rule Movie Songs Records,SOOSEKI Lyrical Video,Allu Arjun,Fahadh Faasil,Rashmika Mandanna,Sukumar,DSP,SOOSEKI Lyrical Video,Pushpa Pushpa Song,Top 100 Music Videos,The Couple Song,Youtube Global Charts,Pushpa 2,Pushpa 2 The Rule Songs In The Top 100 Music Videos,Pushpa 2 The Rule Songs Update

సినిమా రిలీజ్ కు ముందే పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఈసినిమా వస్తుండగా ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటి నుండే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి సినిమాపై ఇంకా బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి రెండు పాటలు ఈ పాటలు మాత్రమే రిలీజ్ చేశారు. పుష్ప పుష్ప అనే మొదటి పాట, సూసేకి అనే రెండో పాటను రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ చేసింది రెండు పాటలే అయినా కూడా సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తుంది. తాజాగా పుష్ప‌-2లోని సాంగ్స్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాయి. ప్రపంచ‌వ్యాప్తంగా యూట్యూబ్ టాప్ 100 మ్యూజిక్ వీడియోస్ జాబితాలో పుష్ప 2 పాటలు స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. టాప్ 100 లో సూసేకి పాట 2వ ప్లేస్ లో, అదే పాట హిందీ వెర్షన్ అంగారో పాట 8వ ప్లేస్ లో, పుష్ప పుష్ప హిందీ పాట 57వ ప్లేస్ లో, పుష్ప పుష్ప తెలుగు వెర్షన్ 79వ ప్లేస్ లో నిలిచాయి. ఇక పుష్ప 2 పాటలు ఇలాంటి రికార్డు క్రియేట్ చేయడంతో చిత్రయూనిట్ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని తమ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. ఇలా ఒకే సినిమాకు చెందిన పాట‌లు టాప్-100లో చోటు ద‌క్కించుకోవ‌డంతో పుష్ప ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

 

కాగా రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.