జనసేనానికి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

Megastar Chiranjeevi Congratulates Janasena Chief Pawan Kalyan

తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. తెలుగుదేశం పార్టీ కూటమి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధికారం చేపట్టడం ఖాయమైంది. ఈ కూటమిలో టీడీపీతో పాటుగా బీజేపీ, జనసేన పార్టీలు కూడా భాగమే అన్న విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 21 చోట్ల పోటీ చేసిన జనసేన.. ఆ పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పోటీ చేసిన పిఠాపురం సహా అన్ని స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఆయనకు చిత్ర పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో పవన్ సోదరుడు, టాలీవుడ్ అగ్రహీరో, మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో ఇలా తెలిపారు. “నా ప్రియమైన కళ్యాణ్ బాబు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల భారీ & అద్భుతమైన ఆదేశానికి పులకించిపోయాను. మీరు నిజంగా ఈ ఎన్నికల గేమ్ ఛేంజర్. మీరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్! ఏపీ ప్రజల పట్ల మీకున్న ప్రగాఢమైన శ్రద్ధ, దూరదృష్టి, రాష్ట్రాభివృద్ధిపై మీ హృదయపూర్వక కోరిక, మీ త్యాగాలు, మీ రాజకీయ వ్యూహాలు ఈ అద్భుతమైన ఫలితంలో వ్యక్తమయ్యాయి. నేను మీ గురించి గర్వపడుతున్నాను! హృదయపూర్వక అభినందనలు!!!” అని పేర్కొన్నారు. కాగా మరోవైపు ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరో, మెగాస్టార్ పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.