10 ఏళ్ల కష్టం.. ఈ పదేళ్లలో ఎన్నో అవమానాలు అయినా కూడా ఎక్కడా బెదరకుండా అలుపెరుగని కృషితో ఫైనల్ గా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేడు ఏపీ ఎన్నికల ఫలితాలు అన్న సంగతి తెలిసిందే కదా. ఈరోజు కోసం ఎప్పటినుండో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నేడు ఆరోజు రానే వచ్చేసింది. అందరూ ఫలితాలను ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. దానికి తగిన ఫలితాన్నే నేడు చూస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేశారు. ముందు నుండీ పవన్ కళ్యాణ్ గెలుపుపై ధీమాగా ఉన్నా ఎంత మెజార్టీతో గెలుస్తాడు అన్నదాని కోసమే జనసైనికులు ఎదురుచూశారు. దాదాపు 50 వేల పైన మెజార్టీ వస్తుందని ప్రగాఢ నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు అదే నిజం చేస్తూ అంతకంటే ఎక్కువ 70వేల 354 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని అందుకున్నాారు. పిఠాపురం ప్రజలు రికార్డు మెజారిటీతో పవన్ కల్యాణ్ కు గెలుపును బహుమతిగా అందించారు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా లీడింగ్ లో దూసుకెళ్తుండటం విశేషం.
ఇక పవర్ స్టార్ గెలుపు పై పవన్ అభిమాలు సంబరాలు చేసుకుంటున్నారు. అభిమానులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియచేస్తున్నారు. నితిన్, సాయి ధరమ్ తేజ్, హరీష్ శంకర్, అల్లు అర్జున్, ఎస్ జే సూర్య ఇలా అందరూ పవన్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































