‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అనంతరం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం దీనికి సీక్క్వెల్‌ని రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు ఆయన. ఈ నేపథ్యంలో నేడు ప్రశాంత్ నీల్ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Rebel star #Prabhas wishes his dear friend and director #PrashanthNeel on his birthday with this unseen candid click from the sets of #Salaar! 😍❤️#HBDPrashanthNeel #SalaarShouryaangaParvam #TeluguFilmNagar pic.twitter.com/TsmuVOyg9R
— Telugu FilmNagar (@telugufilmnagar) June 4, 2024
ఇక సలార్ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ నీల్‌కు బర్త్ డే విషెస్ తెలిపింది. దీనికి సలార్ సెట్స్‌లో ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ ఉన్న ఫోటోను షేర్ చేసింది. కాగా సలార్ పార్ట్ 1 సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సీక్క్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే సలార్ పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఇదిలావుండగా.. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఈ 27వ తేదీన విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























