మాలాంటి యంగ్ డైరెక్టర్స్‌కి ఆయన సినిమాలే బెంచ్ మార్క్ – లోకేష్ కనకరాజ్

Shankar Movies are Like Bench Mark For The Young Directors, Says Lokesh Kanagaraj

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ఈ మూవీ పాటలు సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుకకు హీరో శింబు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నెల్సన్, నిర్మాత ఏ ఎం రత్నం, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ.. “ఇండియన్ 2 అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. శంకర్ గారు, కమల్ హాసన్ గారి కాంబోని మళ్లీ చూడాలని వెయిట్ చేస్తున్నాను. బ్రహ్మాండం అనే పదం శంకర్ గారి సినిమాలకే సెట్ అవుతుంది. మాలాంటి యంగ్ డైరెక్టర్స్‌కి ఆయన సినిమాలే బెంచ్ మార్క్. ఈ సినిమా కోసం ఓ ఆడియెన్‌లా ఎదురుచూస్తున్నాను” అని అన్నారు.

ఇక మరో స్టార్ డైరెక్టర్ నెల్సన్ మాట్లాడుతూ.. “శంకర్ గారు తీసిన ఐ, 2.ఓ సినిమా ఈవెంట్లకు నేనే డైరెక్టర్‌గా పని చేశాను. ఆయన హద్దుల్ని ఆయనే చెరిపేస్తుంటారు. అలాంటి దర్శకులు ఉండటం మనకు గర్వ కారణం. తమిళ్ బిగ్ బాస్‌కు బ్యాక్ ఎండ్‌లో పని చేశాను. ప్రతీ విషయాన్ని ఆయన ఎంతో నిశితంగా గమనిస్తుంటారు. సుభాస్కరన్ వంటి వారు మాత్రమే ఇలాంటి భారీ సినిమాను నిర్మించగలరు. ఈ చిత్రం ఓ చరిత్రను సృష్టించబోతోంది” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.