శివాజీ గణేశన్ అన్న ఆ ఒక్క మాటతో ‘ఇండియన్’ చేశాను – కమల్ హాసన్

Kamal Haasan Says, Sivaji Ganesan Advised me to Act in Indian Movie

కోలీవుడ్ అగ్ర నటుడు, సీనియర్ హీరో శివాజీ గణేశన్ సూచన మేరకే తాను ‘ఇండియన్’ చిత్రంలో నటించానని పేర్కొన్నారు లోకనాయకుడు కమల్ హాసన్. ఈ మేరకు ఆయన ఆదివారం చెన్నైలో జరిగిన ‘భార‌తీయుడు 2’ (ఇండియన్ 2) ఆడియో వేడుక‌లో పాల్గొని ప్రసంగించారు. ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ దర్శకత్వం వహిస్తుండగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా న‌టిస్తుంది. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 12న తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖుల సమక్షంలో ‘భార‌తీయుడు 2’ ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇక ఈ కార్యక్రమానికి హీరో శింబు, స్టార్ డైరెక్టర్స్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నెల్సన్, ప్రొడ్యూసర్స్ ఏ ఎం రత్నం, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కాగా ఈ వేడుకలో శృతి హాసన్, మౌనీ రాయ్, డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితీ శంకర్, కొడుకు అర్జిత్ శంకర్ ఇచ్చిన లైవ్ పర్ఫామెన్స్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. “28 ఏళ్ల క్రితం ఇండియన్ సినిమా టైంలో నేను శివాజీ గణేశన్ గారితో ఓ సినిమా చేయాలి. ఆ టైంలోనే శంకర్ ఇండియన్ కథతో వచ్చారు. రెండు కథలు కొంచెం దగ్గరదగ్గరగా ఉన్నాయి. అదే విషయాన్ని శివాజీ గణేశన్ గారితో చెప్పాను. ‘శంకర్ గారితోనే సినిమా చేయండి.. ఆయన ఆల్రెడీ ఓ సినిమాను తీశారు. మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కలిసి చేశాం’ అని నాతో ఆయన అన్నారు. ఆయన అన్న ఒక్క మాటతో, ఆ నమ్మకంతోనే శంకర్ గారితో ఇండియన్ సినిమా చేశాను” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఆ టైంలో నేను గానీ, శంకర్ గానీ రెమ్యూనరేషన్‌ల గురించి మాట్లాడుకోలేదు. ఏ ఎం రత్నం గారు సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఆ టైంలోనే నేను శంకర్ గారితో సీక్వెల్ గురించి మాట్లాడాను. కానీ శంకర్ గారు మాత్రం కథ రెడీగా లేదని అన్నారు. మళ్లీ ఇన్నేళ్లకు, అంటే 28 ఏళ్ల తరువాత ఇండియన్ 2 చేశాం. ఈ ప్రాజెక్ట్ ఇక్కడివరకు వచ్చిందంటే లైకా అధినేత సుభాస్కరన్ గారే కారణం. ఎన్నో సవాళ్లు ఎదురైనా మాకు అండగా నిలిచారు. ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఆయన మాపై పెట్టిన నమ్మకమే ఈ చిత్రం. ఆయన నమ్మకానికి తగ్గట్టుగానే ఈ సినిమాను మేం చేశాం” అని అన్నారు.

అలాగే “మా చిత్రానికి సపోర్ట్ చేసిన ఉదయనిధి స్టాలిన్, తమిళ కుమరన్, సెంబగ మూర్తికి థాంక్స్. కాజల్, రకుల్, సిద్దార్థ్, ఎస్ జే సూర్య, సముద్రఖని ఇలా అందరూ అద్భుతమైన పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతంలో ఎప్పుడూ ఎనర్జీ ఉంటుంది. ఆయన అద్భుతమైన పాటలు ఇచ్చారు. రవి వర్మన్ నాకు అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా ఉన్న టైం నుంచీ తెలుసు. ఆయన అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఇండియన్ సినిమాకు మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసిన హాలీవుడ్ టెక్నీషియన్‌తో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉంది. నాకు సహకరించిన టీం మెంబర్స్ అందరికీ థాంక్స్” అని కమల్ హాసన్ అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.