టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్వాగ్ ‘. ఇప్పటికే ఆయన ‘సామజవరగమనా’, ‘ఓం భీమ్ బుష్’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రయోగాత్మక సినిమాలలో నటించేందుకు ఆసక్తి కనబరిచే శ్రీ విష్ణు మరోసారి దీనిని కొనసాగిస్తూ సరికొత్త పంథాలో ఈ స్వాగ్ మూవీలో నటిస్తున్నారు. ఈ క్రమంలో అచ్చ తెలుగు సినిమా #SWAG అంటూ ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా స్వాగ్ నుంచి మరో అప్‌డేట్ అందించారు మేకర్స్. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రముఖ నటి నటిస్తున్నట్లు వెల్లడించారు. ఆ నటి మరెవరో కాదు, ఒకప్పటి స్టార్ హీరోయిన్, మాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ మీరా జాస్మిన్. ఈ మేరకు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆదివారం ఆమె పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. యువరాణి ఉత్పల దేవిగా మీరా కనిపించనున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
Here we bring 🥁
The World of #SWAG brings to you the QUEEN that reigned all our hearts, #MeeraJasmine on-board 🥳✨Our #అచ్చతెలుగుసినిమా has a lot in store.
Brace yourselves 🤞@sreevishnuoffl @riturv @vishwaprasadtg @hasithgoli @peoplemediafcy @vivekkuchibotla #KrithiPrasad… pic.twitter.com/fmoIkmvuhX— People Media Factory (@peoplemediafcy) June 2, 2024
కాగా స్వాగ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తుండగా.. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్‍గా నటిస్తుంది. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ సినిమాను జూలై మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























