అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పటివరకూ పలు సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా వస్తున్న సినిమా టైసన్ నాయుడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్ లో జరుపుకుంటుంది. అక్కడ దాదాపు 100 మంది ఫైటర్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులతో కలిసి భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. షూటింగ్ కు సంబంధించి ఫొటోలు కూడా పోస్ట్ చేశారు.
#TysonNaidu shooting in full swing 🔥
The team is currently shooting a massive action sequence with 100 fighters and 300 junior artists in Rajasthan ❤🔥@BSaiSreenivas @saagar_chandrak @RaamAchanta #GopiAchanta #Bheemsceciroleo @artkolla pic.twitter.com/EFJDqAllOP
— 14 Reels Plus (@14ReelsPlus) June 1, 2024
కాగా ఈసినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ జ్ఞానేష్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























