టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా హరోం హర. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న ఈసినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేయగా అన్నీ ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఈసినిమా కూడా ఎన్నోసార్లు వాయిదా పడింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే31వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అదే రోజున పలు సినిమాలు రిలీజ్ కు ఉండటం.. ఇంకా పలు కారణాల వల్ల సినిమాను వాయిదా వేశారు. ఫైనల్ గా జూన్ 14వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ వాయిదా పై క్లారిటీ ఇచ్చాడు సుధీర్ బాబు. ఈసినిమా రిలీజ్ వాయిదా వేయడానికి అనేక కారణాలున్నాయి. ముందుగా క్వాలిటీ ఎక్స్ పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించాలని అనుకున్నాం.. ఈనేపథ్యంలోనే ప్రస్తుతం కేరళలో డీఐ వర్క్ జరుగుతోంది. కింగ్ ఆఫ్ కోత కోసం డీఐ చేసిన టెక్నీషియన్లు ఈసినిమా కోసం పనిచేస్తున్నారు. థగ్ లైఫ్ కు పనిచేస్తున్న వారు సౌండ్ ఎఫెక్ట్‌లను పర్యవేక్షిస్తున్నారు.. ఇంకా ఇక్కడ జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ జూన్ 4న ఎన్నికల ఫలితాలు ఉన్నాయి.. ఇవన్నీ చూసే విడుదల వాయిదా వేశామని తెలిపారు.
కాగా కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్ తో ఈసినిమా రానున్నట్టు అర్థమవుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























