బచ్చలమల్లి నుండి అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ రిలీజ్

allari naresh first look released from Bachhala Malli movie

ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో అలరించాడు అల్లరి నరేష్. సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా డీసెంట్ హిట్ నే అందించింది. ఆ తరువాత ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాతో వచ్చాడు. ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వచ్చేస్తున్నాడు. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో నరేష్ హీరోగా వస్తున్న సినిమా బచ్చలమల్లి. 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామా పాయింట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా నుండి అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పేరు మల్లి, ఇంటి పేరు బచ్చల చేసేది ట్రాక్టర్ డ్రైవింగ్.. ఈ బచ్చల మల్లి ఖచ్చితంగా మీకు చాలా రోజులు గుర్తుండిపోతాడు అంటూ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఓ రేంజ్ లో ఉంది. రిక్షాలో సిగరెట్ తాగుతూ కూర్చొని ఫుల్ మాస్ అండ్ రస్టిక్ గా ఉన్న అల్లరి నరేష్ పిక్ అయితే సినిమా అంచనాలను అమాంత పెంచేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. మానాడు, రంగం, మట్టి కుస్తీ చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.