శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. రొమాంటిక్ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక జూన్ 7వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ టీజర్ అన్నీ కూడా సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక నా మాటే, మనమే అంటూ వచ్చే రెండు పాటలను రిలీజ్ చేశారు. ఇప్పుడు మూడో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు. టప్పా టప్పా అంటూ వచ్చే వెడ్డింగ్ సాంగ్ ను మే 30వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఒక కలర్ ఫుల్ ఫోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
Bringing you all 𝑻𝒉𝒆 𝑾𝒆𝒅𝒅𝒊𝒏𝒈 𝑺𝒐𝒏𝒈 𝒐𝒇 𝒕𝒉𝒆 𝒀𝒆𝒂𝒓, Get ready with your dancing shoes! 🕺💃#Manamey 3rd Single ~ #TappaTappa dropping on May 30th! 🥳
A @HeshamAWMusic Musical 🎹@ImSharwanand @IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @IamSeeratKapoor… pic.twitter.com/F0nRhCcsQ6
— People Media Factory (@peoplemediafcy) May 28, 2024
కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. విక్రమ్ ఆదిత్య కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫి అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























