పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పవన్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో తను చేస్తున్న కొత్త సినిమాల షూటింగ్ లు అన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజీత్ ఓజీ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఓజీ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది.. టీజర్ కూడా రెడీ అవుతుంది అని అన్నాడు. నా మీద జపనీస్ సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కల్యాణ్ గారికి కూడా జపనీస్ సినిమాలు అంటే చాలా ఇష్టం.. అకీరాకు కూడా జపనీస్ సినిమా నుండి తీసుకున్నదే.. ఓజీ అంటే ఓజస్ గంభీర.. ‘ఓజస్’ అంటే మాస్టర్ అని, ‘గంభీర’ అనేది హీరో పేరు అని చెప్పారు. ఇక ‘ఓజీ’ అంటే ఒరిజినల్ గ్యాంగస్టర్ అనే అర్థం కూడా వస్తుందన్నారు.
అంతేకాదు నేను ప్రభాస్ తో కూడా పనిచేశాను.. ఇప్పుడు పవన్ తో చేస్తున్నాను.. అయితే ఇద్దరిలో నేను ఒక కామన్ పాయింట్ అయితే గమనించాను.. ప్రభాస్, పవన్ ఇద్దరూ తమ పని తాము చేసుకుంటూ వెళతారు.. ఇతరుల విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు.. వేరే వారిపై కంప్లైట్ ఇవ్వడం కూడా నేనెప్పుడూ చూడలేదని తెలిపాడు.
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































