బుజ్జిపై నాగచైతన్య రైడింగ్.. కల్కి టీమ్‌కి హ్యాట్సాఫ్

Kalki 2898 AD Naga Chaitanya Akkineni Meets Prabhas' Bujji and Goes For A Ride

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బుజ్జి’ గురించే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఈ బుజ్జి ఎవరంటే..? పాన్ ఇండియా స్టార్ పభాస్‌ హీరోగా నటిస్తోన్న ‘కల్కి 2898 AD’ చిత్రంలో కనిపించనున్న కారు. అయితే ఈ కారు సినిమాలో చాలా కీలక పాత్ర పోషించనుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే తెలియజేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆ కారును డిజైన్ చేయించడం విశేషం. ఎఫ్‌ 1 రేసింగ్‌లో పాల్గొనే కార్ల వంటి మోడల్‌లో ఉన్న బుజ్జిని చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ‘బుజ్జి’ని ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం ఇటీవలే మేకర్స్‌ స్పెషల్‌ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ కార్యక్రమంలో ప్రభాస్ బుజ్జిపై అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఖుషీ చేశారు. ఇదిలావుండగా తాజాగా యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య బుజ్జిని కలిశారు. బుజ్జి తయారీని చూసి ఆశ్చర్యపోయాడు చైతూ. ఈ సందర్భంగా బుజ్జిపై ఆయన రైడింగ్ కూడా చేశారు. రైడ్ అనంతరం సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలియజేశారు. అందులో.. ‘‘నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. మీరు ఇంజనీరింగ్‌కు సంబంధించిన అన్ని రూల్స్‌ను బ్రేక్ చేశారు. ఈ విజన్‌ని రియాలిటీలోకి తెచ్చినందుకు మొత్తం టీమ్‌కి హ్యాట్సాఫ్.. నిజంగా ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. బుజ్జితో హాయిగా గడిపాను” అని పేర్కొన్నారు చైతూ.

కాగా నాగచైతన్య బుజ్జిని కలవడం, దానిపై రైడ్‌కు వెళ్లడం.. ఇదంతా వీడియోగా తీసి తమ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది కల్కి చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌. అయితే చైతూకు కార్లంటే చాలా ఇష్టం. అందుకే తన దగ్గర అడ్వాన్స్‌ మోడల్‌ కార్‌ కలెక్షన్స్‌ చాలా ఉన్నాయి. అలాంటి హీరో బుజ్జిని చూసి ప్రశంసించడం, దానితో రైడ్‌కు వెళ్లడం అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ఇక ప్రస్తుతం చైతూ బుజ్జిపై రైడింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కల్కి 2898 ADలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే కథానాయికగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘సలార్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడం, అందునా భారతీయ తెరపై ఇప్పటివరకూ రానటువంటి కథతో రూపొందుతుండటంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ‘కల్కి 2898 AD’ జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.