విశ్వంభరలోకి మరో హీరోయిన్ ఎంట్రీ

Ashika Ranganath Joins Megastar Chiranjeevi's Vishwambhara Movie

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోండగా.. ఇషా చావ్లా చిరు చెల్లెలుగా కనిపించనుంది. వీరితో పాటు మరికొందరు స్టార్ హీరోయిన్స్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో మెగా అభిమానుల కోసం తాజాగా చిత్ర యూనిట్ కీలక అప్‌డేట్ అందించింది. విశ్వంభర చిత్రంలోకి మరో హీరోయిన్ ప్రవేశించింది. ‘నా సామి రంగ’ ఫేమ్ ఆషికా రంగనాథ్ తాజాగా ఈ మూవీలోకి ఎంట్రీ ఇచ్చింది. దీనిని ధృవీకరిస్తూ చిత్రబృందం ఆషికాకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్‌పై.. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. కాగా మెగాస్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోసం పేరొందిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్‌ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ లిరిక్ రైటర్స్ కాగా, శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా ఉన్నారు. కాగా విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.