టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులలో యంగ్ హీరో సుహాస్ ఒకడు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటించగా.. నితిన్ ప్రసన్న కీలక పాత్ర పోషించారు. కాగా ‘ప్రసన్నవదనం’ చిత్రాన్ని లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్లపై మణికంఠ, ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మే 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాలో సుహాస్ ‘ఫేస్ బ్లైండ్‌నెస్’ అనే అరుదైన వ్యాధితో బాధపడే యువకుడిగా నటించాడు. ఈ వ్యాధి బారిన పడినవారు ఎదుటివారి ముఖాన్ని గుర్తుపట్టలేరు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఆహాలో ప్రసన్నవదనం స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్లకు నిన్నటినుంచే అందుబాటులోకి రాగా.. నేటినుంచి అందరూ చూసే అవకాశం కల్పించారు.
ప్రసన్నవదనం కథ ఏంటంటే..?
ఈ చిత్రం ఒక క్రైమ్ చుట్టూ జరిగే ఇన్వెస్టిగేషన్ ప్రధానాంశంగా తెరకెక్కింది. ఒక యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సూర్య (సుహాస్) పేస్ బ్లేండ్‌నెస్ బారిన పడతాడు. దీంతో ఎదుటివారి ముఖాలను గుర్తించలేడు. ఈ క్రమంలో సూర్య ఓ రోజు రాత్రి రోడ్డుపై ఓ మర్డర్ చూస్తాడు. అయితే దీనిని యాక్సిడెంట్‌గా భావించిన పొలీసులు ఆ కేసును క్లోజ్ చేస్తారు. కానీ, సూర్య అది యాక్సిడెంట్ కాదని మర్డర్ అని స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాడు.
ఈ ఘటన అనంతరం సూర్యపై హత్యా ప్రయత్నాలు జరుగుతుంటాయి. తన డిసీజ్ కారణంగా వారు తన పక్కనే తిరుగుతున్నా సూర్య గుర్తింలేక పోతాడు. దీనికితోడు ఆ మర్డర్ చేసింది సూర్య అని జైలుకు పంపిస్తారు పోలీసులు. ఇక ఈ కేసు నుంచి సూర్య ఎలా బయటపడ్డాడు? అసలు నిందితులను కనిపెట్టగలిగాడా? చివరకు ఏం జరుగుతుంది? అనేది తెలియాలంటే ప్రసన్నవదనం చూడాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























