రాయన్ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

dhanush raayan movie second single release date fixed

ఈ ఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు విలక్షణ నటుడు ధనుష్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో రాయన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు స్వయంగా ధనుషే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. మరోవైప సినిమాకు సంబంధించిన అప్ డేట్లను కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ఎవరికి తలవంచడే అంటూ వచ్చే పాటను రిలీజ్ చేయగా ఆ పాటకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. సెకండ్ సింగిల్ ను మే 24వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. అయితే పోస్టర్ ను బట్టి ఈపాట సందీప్ కిషన్ ఇంకా అపర్ణ బాలమురళి మధ్య ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. సందీప్ కిషన్ సైకిల్ తొక్కుతూ ఉంటే ముందు అపర్ణ బాల మురళి కూర్చుని ఉన్న పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో ఇంకా ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్‌, ధుషార విజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్‌ డీవోపీగా అలానే యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా పీటర్‌ హెయిన్‌ వ్యవహరిస్తున్నారు. జూన్ 13న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రాయన్ విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.