ఓటీటీలోకి వ‌చ్చేసిన విశాల్ ర‌త్నం

Vishal's Rathnam Movie Streaming on Amazon Prime Video

తమిళ్ స్టార్ హీరో విశాల్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘రత్నం’. ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ దర్శక, నటుడు స‌ముద్ర‌ఖ‌ని, స్టార్ కమెడియన్ యోగిబాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రత్నం చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్ యాక్షన్ సినిమాలు తీయడంలో పేరొందిన సీనియర్ డైరెక్టర్ హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక గ‌తంలో విశాల్, హ‌రి కాంబినేష‌న్‌లో వచ్చిన ‘పూజ’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో భారీ అంచ‌నాల నడుమ ‘ర‌త్నం’ ఏప్రిల్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్లలో రత్నం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

దీంతో ఈ మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌లై నెల రోజులు కూడా కాక‌ముందే ఈ యాక్ష‌న్ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చేశారు మేకర్స్. ఈ క్రమంలో గురువారం నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. త‌మిళంతో పాటు తెలుగులోనూ ర‌త్నం అందుబాటులో ఉంది. సో.. యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లో కూర్చునే ఈ సినిమాను వీక్షించవచ్చు.

ర‌త్నం క‌థ ఏంటంటే..?

అనాథ అయిన ర‌త్నం (విశాల్) ఎమ్మెల్యే ప‌న్నీర్‌స్వామి (స‌ముద్ర‌ఖ‌ని) దగ్గర న‌మ్మకస్తుడిగా ప‌నిచేస్తుంటాడు. ఈ క్రమంలో ర‌త్నం జీవితంలోకి అనుకోకుండా మ‌ల్లిక (ప్రియా భ‌వానీ శంక‌ర్‌) అనే అమ్మాయి వ‌స్తుంది. అయితే మ‌ల్లిక‌ను చంప‌డానికి లింగం బ్ర‌ద‌ర్స్ అనే రౌడీలు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. వారు ఎందుకు మల్లికను టార్గెట్ చేశారు? వారి నుంచి మ‌ల్లిక‌ను ర‌త్నం ఎలా కాపాడాడు? అసలు ర‌త్నం జీవితం ఇలా అవడానికి కారణం ఏంటి? త‌న శ‌త్రువుల‌పై ర‌త్నం ఎలా పగ తీర్చుకున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే.. మూవీ చూడాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.