సెహరి ఫేం జ్ఞానసాగర్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా హరోం హర. చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో సాగే స్టోరీతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా వస్తోంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా ముగించారు. రీసెంట్ గా హరోంహర నుంచి రిలీజ్ చేసిన మురుగుడి మాయ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సాంగ్ మేకింగ్ బీటీఎస్ స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఇప్పటివరకూ పలు రిలీజ్ డేట్లను మార్చుకున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఫైనల్ గా మే 31వ తేదీన రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయి అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు మేకర్స్. జూన్ 14వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ముహూర్తం లో మార్పు ఉండాది ఏమో.. మాస్ సంభవం లో కాదు జూన్ 14న సుబ్రహ్మణ్యం ఆగమనం అంటూ చిత్రనిర్మాణ సంస్థ తెలిపింది. మరి మే31వ తేదీన పలు సినిమాలు రిలీజ్ కు ఉండటంతో ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేసినట్టు తెలుస్తుంది.
ముహూర్తం లో మార్పు ఉండాది ఏమో
మాస్ సంభవం లో కాదు! 🔱💥జూన్ 14న సుబ్రహ్మణ్యం ఆగమనం!! ❤️🔥#HAROMHARA WORLD WIDE GRAND THEATRICAL RELEASE ON JUNE 14th 2024💥#HaromHaraOnJune14th@IsudheerBabu @suneeltollywood @ImMalvikaSharma @gnanasagardwara @chaitanmusic @Music_Vengi pic.twitter.com/V7ga3LygpN
— Sree Subrahmanyeshwara Cinemas (@SSCoffl) May 21, 2024
కాగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























