భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది కాజల్. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తుంది. ఆయితే మొదటిసారి లేడీ ఒరియెంటెండ్ సినిమాతో వస్తుంది. సత్యభామ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఇందులో కాజల్ ఏసీపీ సత్యభామ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మే24వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు ఈసినిమాలోని క్యారెక్టర్స్ ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. కాజల్ అగర్వాల్ సత్యభామ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంకాా ప్రకాష్ రాజ్ జోసెఫ్ రాజ్, నవీన్ చంద్ర అమరేంద్ర పాత్రలో, రవి వర్మ రమాకాంత్ రెడ్డి పాత్రలో, ప్రజ్వల్ యద్మా ఇగ్బాల్ పాత్రలో, అనిరుధ్ పవిత్రన్ ఎడు, అంకిత్ కొయ్య రిషి రెడ్డి పాత్రలో, సంపాద దివ్వా పాత్రలో, నేహా పఠాన్ హసీనా గా, హర్ష వర్ధన్ ఆనంద్ రావు, నాగినీడు నారాయణ్ దాస్ పాత్రలో నటిస్తున్నారు.
Late endhuku?
Introducing the world of #Satyabhama to you!
Trailer releasing on 24 May, 2024
Stay tuned 💞@AurumArtsOffl @Naveenc212 @sumanchikkala @sashitikka @bobytikka @SricharanPakala @kalyankodati @KumarTV5Cinema @RekhaBoggarapu @GskMedia_PR @adityamusic… pic.twitter.com/LAh2ZTpMDB— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 20, 2024
కాగా అఖిల్ డేగల ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. శశికిరణ్ తిక్క సమర్పణలో ఆయన సోదరుడు బాబి తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























