తెలంగాణ లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడడంతో గతవారం కొత్త సినిమాలు ఏవి విడుదలకాలేదు.అయితే ఈవారం మళ్ళీ తెరుచుకోనుండడంతో రెండు కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాయి. అందులో రాజు యాదవ్ ఒకటి. జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్ జబర్దస్త్ శ్రీను ఇందులో హీరోగా నటించాడు.ఈసినిమాలో హీరో ఏం జరిగిన నవ్వుతూ ఉంటాడు దాని వల్ల ఎలాంటి పరిస్థులను ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో వస్తుంది. కృష్ణమాచారి ఈసినిమాను డైరెక్ట్ చేయగా అంకిత ఖారత్ హీరోయిన్ గా నటించింది.తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాను ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ విడుదలచేస్తుండడం తో భారీ సంఖ్యలో థియేటర్లు దొరకనున్నాయి.ఈనెల 24న రాజు యాదవ్ విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈవారం మరో సినిమాకూడా ప్రేక్షకులముందుకు వస్తుంది అదే లవ్ మీ.దెయ్యంతో లవ్ స్టోరీ అనే డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.దిల్ రాజు ప్రొడక్షన్స్ నుండి వస్తున్న సినిమా కావడం ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడం తో ఈసినిమాకు హైప్ వచ్చింది.రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్ ఇందులో హీరోగా నటించగా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేసింది.ప్రముఖ టెక్నీషియన్లు ఎమ్ఎమ్ కీరవాణి ,పిసి శ్రీరామ్ ఈసినిమాకు పనిచేశారు.లవ్ మీ ఈనెల 25న విడుదలకానుంది.మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటాయో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























