విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ తన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. రీసెంట్ గానే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. తన నటనతో నటుడిగా ఈసినిమాతో మరో మెట్టుఎక్కాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఈసినిమా మే31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు విజయేంద్రప్రసాద్, వంశీ పైడిపల్లి, సాయి రాజేష్ అతిథిలుగా విచ్చేశారు. వీరి సమక్షంలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాలో ఇంకా ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ఆదిత్య జవ్వాడి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























