క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో మక్కల్ సెల్వన్

vijay sethupathi new movie titled as ace

విజయ్ సేతుపతి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను చేసే పాత్రలు రొటీన్ కు భిన్నంగా ఉంటాయి కాబట్టే విజయ్ సేతుపతి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగుతో పాటు పలు భాషల్లో పలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఆరుముగకుమార్‌ అనే దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా టైటిల్, అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాకు ఏస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. యూత్‌ఫుల్‌లుక్‌తో అందరినీ ఆకర్షించేలా విజయ్‌సేతుపతి లుక్‌ ఉంది.

కాగా ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా యోగి బాబు, పి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, రాజ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెవెన్ సీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కరణ్ బహదూర్ రావత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.