ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు.ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి మంచు విష్ణు ఎప్పటికప్పుడు అప్ డేట్లను ఇస్తూనే ఉన్నాడు. ప్రతి అప్ డేట్ నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. అంతేకాదు టీజర్ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. మే20వ తేదీన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఈటీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా నే ఈసినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొన్నట్టు విష్ణు తెలియచేసిన సంగతి తెలిసిందే కదా.
ఇక ఇప్పుడు ఈసినిమాలో మరో స్టార్ హీరోయిన్ జాయిన్ అయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్ చందమామ కాజల్. ఈసినిమాలో కాజల్ అగర్వాల్ నటించనున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. కాగా కాజల్ అగర్వాల్, మంచు విష్ణు కలిసి మోసగాళ్లు సినిమాలో కలిసి నటించారు. మరి కాజల్ ఈసినిమాలో ఏ పాత్రలో నటిస్తుందో చూడాలి.
We are thrilled to announce another star attraction in @iVishnuManchu‘s #Kannappa🏹: The talented @MsKajalAggarwal is all set to shine in an important role!
Stay tuned for an unforgettable cinematic experience!@24FramesFactory @avaentofficial @KannappaMovie#KannappaMovie… pic.twitter.com/aGZKUa2wzJ— Kannappa The Movie (@kannappamovie) May 17, 2024
కాగా ఈసినిమాలో నయనతార, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాతోనే మంచు ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ విష్ణు తనయుడు అవ్రామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























