టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుండగా.. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ స్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు ‘లవ్ మీ’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ మూవీ విశేషాలు పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నటుడు రవికృష్ణ మాట్లాడుతూ.. “విరూపాక్ష చేసిన టైంలో ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఈ మూవీకి చేసినప్పుడు కూడా అలాంటి ఫీలింగే కలిగింది. ఇంత మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. వైష్ణవి, ఆశిష్‌లతో పని చేయడం ఆనందంగా ఉంది. మే 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి” అని అన్నారు.
అలాగే నటి సిమ్రన్ చౌదరి మాట్లాడుతూ.. “స్కల్ రీకన్‌స్ట్రక్షన్ ఆర్టిస్ట్ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తాను. దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. ఈ మూవీకి తక్కువ రోజులే పని చేసినా వైష్ణవి, ఆశిష్‌లు ఫ్యామిలీ మెంబర్స్‌లా మారిపోయారు. మే 25న చిత్రం రాబోతోంది. అందరూ చూడండి” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























