విభిన్నమైన పాత్రలు చేసి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. సినిమా జయాపయాలతో సంబంధం లేకుండా ప్రస్తుతం అయితే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా తన నుండి వచ్చిన సినిమా కృష్ణమ్మ. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా మే 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన వారం రోజులకే ఈసినిమా ఓటీటీలోకి వచ్చేయడం విశేషం.
కాగా ఇంకా ఈసినిమాలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కింది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మించారు. కాలబైరవ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























